గూగుల్ ప్లే స్టోర్‌కు జోకర్ మాల్‌వేర్

by Harish |
గూగుల్ ప్లే స్టోర్‌కు జోకర్ మాల్‌వేర్
X

గతేడాది జోకర్ మాల్‌వేర్ విజృంభించి దావానంలా వ్యాపించడం మనం చూశాం. దాన్ని కట్టడి చేసే సెక్యూరిటీని గూగుల్ ప్లే స్టోర్.. మెరుగుపరుచుకోగలిగింది. అయితే కోడ్‌లో చిన్న మార్పులు చేసుకుని ఇదే జోకర్ వైరస్ మళ్లీ విజృంభించింది. ఈసారి కోడ్‌లో మార్పు కారణంగా ప్లే స్టోర్ సెక్యూరిటీని ఇది దాటగలుగుతోంది. దీని కారణంగా ఇప్పటికే గూగుల్ 11 యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు సమాచారం. విశ్వసనీయ యాప్‌ల ద్వారా ఈ మాల్‌వేర్ ప్లే స్టోర్‌లో ప్రవేశిస్తుంది. తర్వాత సంబంధిత వినియోగదారుని అనుమతి లేకుండానే అన్ని ప్రీమియం సదుపాయాలను పొందడానికి వినియోగదారు బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు చెల్లిస్తుంది.

గూగుల్ డిలీట్ చేసిన 11 యాప్‌లలో బాగా ఉపయోగపడే ఆండ్రాయిడ్ ఆధారిత యాప్‌లు కూడా ఉన్నాయి. గత మాల్‌వేర్ నిర్మాణంతో పోల్చితే ఈసారి జోకర్ వైరస్ చాలా సంక్లిష్ట నిర్మాణం కలిగి ఉందని సైబర్ నిపుణులు అంటున్నారు. గతంలో సీసీ సర్వర్‌తో కమ్యూనికేట్ అయిన తర్వాత మాల్‌వేర్ ప్లేస్టోర్ మీద దాడి చేసేదని, ఇప్పుడు ఎలాంటి కమ్యూనికేషన్ అవసరం లేకుండా నేరుగా దాడి చేయగలిగి స్వంత నిర్ణయాలు తీసుకోగలుగుతోందని వారు వివరించారు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా నమ్మకం లేని డెవలపర్ల నుంచి ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను ఒకసారి సరిచూసుకోవాలని ప్రముఖ సైబర్ మేగజైన్ చెక్ పాయింట్ చెబుతోంది.

Advertisement

Next Story