- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు

దిశ, ములుగు: పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో ములుగు నియోజకవర్గం కొత్తగూడ మండలం, ఎంచగుడ గ్రామానికి చెందిన పలువురు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే సీతక్క వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా అధికారంలో ఉన్నా.. లేకున్నా పేద ప్రజల కోసం పేద ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని సీతక్క పిలుపునిచ్చారు.
- Tags
- congress mla