SSC GD Constable అభ్యర్థులకు అలర్ట్ .. ఏప్రిల్ 24 నుంచే ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌లు

by Harish |
SSC GD Constable అభ్యర్థులకు అలర్ట్ .. ఏప్రిల్ 24 నుంచే ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌లు
X

దిశ, కెరీర్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గతేడాది నవంబర్‌లో.. వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. 10వ తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు.. అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ).. ఎన్‌సీబీలో సిపాయి పోస్టులు భర్తీకి జనవరి, ఫిబ్రవరి నెలల్లో పరీక్షను నిర్వహించగా ఇటీవల ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పుడు తాజాగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.


Next Story

Most Viewed