- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
4000 అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అర్హతలివే?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులకు కేవలం మహిళల చేత భర్తీ చేయనున్నారు. కాగా వీరు ఏడవ తరగతి, పదో తరగతి అర్హతతో జిల్లా స్థానికత గల వారు, పెళ్లైన మహిళలు ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, ఒక హెల్పర్ ఉంటే మినీకేంద్రాల్లో మాత్రం ఒక టీచర్ ఉంటారు. ఇక్కడ హెల్పర్ ఉండరు. తాజాగా మినీ కేంద్రాల అప్‌గ్రేడ్‌తో అక్కడ హెల్పర్ పోస్టు అనివార్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు అప్‌గ్రేడ్ వివరాలు పంపింది. రాష్ట్రవ్యాప్తంగా పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రిటైర్మెంట్ పాలసీతో దాదాపు రెండున్నర వేల మంది టీచర్లు పదవీ విరమణ పొందాల్సి ఉంది. కాగా అన్ని రకాల్లో కలిపి 4 వేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటాయి. అయితే కొన్ని జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్లు జారీ చేసి, భర్తీ ప్రక్రియ ప్రారంభించింది. కానీ పలు కారణాలతో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.