- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు అలర్ట్ .. ఏపీ గ్రూప్-2 సిలబస్ లో మార్పులు
దిశ, కెరీర్: గ్రూప్-2 కు సంబంధించి సిలబస్ లో పలు మార్పులు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. రెండు దశల రాత పరీక్షల ద్వారా గ్రూప్-2 నియామకాలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి మొదట స్క్రీనింగ్ ఎగ్జామ్ ను (ప్రిలిమ్స్) నిర్వహించనున్నారు. రెండో దశలో 300 మార్కులకు గాను మెయిన్స్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారిని మెయిన్స్ కు ఎంపిక చేయనున్నారు. ఈ ప్రిలిమ్స్ కు సంబంధించి సిలబస్ లో భారతీయ సమాజం అనే కొత్త టాపిక్ ను చేర్చారు. మార్పులు చేసిన సిలబస్ ప్రకారం.. ప్రిలిమ్స్ లో భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ తదితర టాపిక్‌ల నుంచి ప్రశ్నలు అడగుతారు.
మెయిన్స్ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. మొత్తం రెండు పేపర్లకు కలిపి 300 మార్కులకు ఈ ఎగ్జామ్ ఉంటుంది. పేపర్-1 కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం ఉంటాయి. పేపర్-2లో భారతదేశ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర టాపిక్స్ ఉంటాయి.
ఇవి కూడా చదవండి: