మీకు ఉద్యోగం కావాలా..? అయితే వెంటనే ఇది తెలుసుకోండి

దిశ, వెబ్ డెస్క్: పలు పోస్టులకు సంబంధించి భారత ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్ కు చెందిన లక్నో కేంద్రం దరఖాస్తులు కోరుతోంది. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్, ప్రొడ్యూసర్, కాపీ ఎడిటర్, స్టెనోగ్రాఫర్, కెమెరామెన్, గ్రాఫిక్ ఆర్టిస్ట్, అసిస్టెంట్ వెబ్ సైట్ ఎడిటర్ పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు కోరుతున్నది. దరఖాస్తు చేసుకునే పోస్టుకు సంబంధించి ఆ సబ్జెక్టుల్లో డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం ఉండాలని పేర్కొన్నది. ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది. ఇతర వివరాలకు వెబ్ సైట్ ను సంప్రదించాలని పేర్కొన్నది.

Advertisement