పీఆర్సీపై తేల్చేసిన సీఎం జగన్.. తగ్గేదేలే అంటున్న ఉద్యోగ సంఘాలు.. 

by srinivas |
పీఆర్సీపై తేల్చేసిన సీఎం జగన్.. తగ్గేదేలే అంటున్న ఉద్యోగ సంఘాలు.. 
X

దిశ, ఏపీ బ్యూరో: పీఆర్సీ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. పీఆర్సీ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందని పదిరోజుల్లో ప్రకటిస్తామంటూ.. చిత్తూరులో సీఎం జగన్ ప్రకటించారు. సీఎం ప్రకటనతో ఉద్యోగ సంఘాలు శాంతిస్తాయని అంతా భావించారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం తగ్గేది లేదంటున్నాయి. సీఎం ప్రకటనపై ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఫ్యాప్టో అధ్యక్షుడు శ్రీధర్‌లు స్పందించారు. మాకు పీఆర్సీ పై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదన్నారు.

పది రోజుల్లో పీఆర్సీ ప్రక్రియ పూర్తి చేస్తాం అని సీఎం చెప్పినట్లు మీడియా లో చూశామని.. ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. అయితే తమ డిమాండ్ ఒక్క పీఆర్సీ మాత్రమే కాదని పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, జీపీఎఫ్ చెల్లింపులు, సీపీఎస్ రద్దు వంటివి ఉన్నాయని చెప్పుకొచ్చారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సైతం ఈ అంశాలపై ప్రస్తావిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed