- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ పరీక్షలు మాకొద్దు.. ట్విట్టర్‌లో జేఎన్టీయూ స్టూడెంట్స్
దిశ, హైదరాబాద్: కోవిడ్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న ఈ సమయంలో నిర్వహించే పరీక్షలు మా కొద్దు అంటూ జేఎన్టీయూ విద్యార్థులు ట్విట్టర్ బాట పట్టారు. జేఎన్టీయూ పరిధిలో నిర్వహించే అన్ని పరీక్షలకు విశ్వవిద్యాలయం టైం టేబుల్ విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి పరీక్షలు జరుగుతాయని షెడ్యూల్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ మొదటి, రెండు, మూడు, నాల్గోవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. అయితే కరోనా రోజురోజుకూ పెరిగిపోతూ అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న ఈ తరుణంలో పరీక్షలు రద్దు చేసి విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ విషయాన్ని సామాజిక మాద్యమాల్లో పోస్టు చేస్తున్నారు. గతవారం రోజులుగా ఇంజనీరింగ్ విద్యార్థులు ట్విటర్‌లో ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో పాటు, మంత్రులకు ట్వీట్ చేస్తున్నారు.
పరీక్షలొద్దంటున్న 80 శాతం విద్యార్థులు..
జేఎన్టీయూ పరిధిలో నిర్వహించే ఇంజనీరింగ్ పరీక్షలు రద్దు చేయాలని 80 శాతం విద్యార్థులు కోరుతున్నారు. అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాలని వారు ట్విటర్లో ‘జేఎన్టీయూ అండ్ ఓయూ మస్ట్ ప్రమోట్ ఆల్ ద స్టుడెంట్స్ టూ సేవ్ ద ఫ్యూచర్’ అంటూ పోస్టు చేస్తున్నారు. అయితే ఫైనలియర్ రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదటి, మూడు సంవత్సరాల విద్యార్థులను ఫైనలియర్‌కు ప్రమోట్ చేసేందుకు మొదటి మూడేండ్లలో వచ్చిన మార్కుల ఆధారంగా సెమిస్టర్‌లో మార్కులు కేటాయించాలని మరికొంత మంది విద్యార్థులు కోరుతున్నారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కరోనా గుబులు..
ఒకవేళ జేఎన్టీయూ పరిధిలో ఈ నెల 20వ తేదీ నుంచి ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహిస్తే పరీక్షా కేంద్రాలకు ఎలా చేరుకోవాలనే విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది విద్యార్థులకు వ్యక్తిగత వాహనాలు లేవు, బస్సులలో ప్రయాణిస్తే కరోనా గుబులు, వీటన్నింటిని అధిగమించి పరీక్షా కేంద్రాలకు చేరుకుంటే ఎవరికి కరోనా ఉందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఫైనలియర్ పరీక్షలు నిర్వహిస్తే తమ పిల్లల భవిష్యత్ పై ప్రభావం చూపుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల నిర్వహణ తప్పనిసరైతే ఫైనలియర్ రెండో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసి కరోనా ప్రభావం తగ్గి పరిస్థితులు చక్కబడిన తర్వాత నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఓయూ పరిధిలో..
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఇంజనీరింగ్ పరీక్షల షెడ్యూల్ అధికారులు ఇంకా విడుదల చేయలేదు. ఈ నెల 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణ ఎలా ఉంటుంది, పరీక్షల కోసం అధికారులు చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇంజనీరింగ్ పరీక్షల కోసం చేయవలసిన మార్పులేమిటీ అనే అంశాలపై ఓయూ అధికారులు దృష్టి సారించారు. పరీక్షల నిర్వహణ కోసం ఈ నెల 2వ వారంలో ఓయూ స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది. జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో ఓయూ పరిధిలో ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా వీలు కాని పక్షంలో అవసరమైతే ఇంజనీరింగ్ ఫైనలియర్ రెండో సెమిస్టర్ విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు తెలిసింది.