బంపర్ ఆఫర్.. తక్కువ ధరలో జియో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్

by Shamantha N |   ( Updated:2021-06-24 05:59:49.0  )
Jio-Phone-Next
X

దిశ, వెబ్‌డెస్క్ : రిలయన్స్​ ఇండస్ట్రీస్ ​44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్మన్ ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. గూగుల్, జియో సంయుక్తంగా జియోఫోన్​ నెక్ట్స్అ నే స్మార్ట్​ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 10వ తేదీ నాటికి మార్కెట్‌లోకి వస్తుందని తెలిపారు. ఆండ్రాయిడ్​వెర్షన్ ఓఎస్‌తో గూగుల్, జియో అప్లికేషన్స్ అన్నీ పనిచేసేలా ఫోన్‌ను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. జియోఫోన్ నెక్ట్స్ భవిష్యత్తులో భారత్‌లోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకే లభించే స్మార్ట్ ఫోన్‌గా నిలుస్తుందని అంబానీ వెల్లడించారు.

జియో ఫోన్​నెక్ట్స్​ ఫీచర్స్ ఇవే..

– వాయిస్​ అసిస్టెంట్​.
– రియాలిటీ ఫిల్టర్స్‌తో స్మార్ట్​ కెమెరా.
– లాంగ్వేజ్​ ట్రాన్స్​లేషన్​.

Advertisement

Next Story