అందుబాటులోకి ‘జియోమార్ట్ యాప్’

by Harish |
అందుబాటులోకి ‘జియోమార్ట్ యాప్’
X

దిశ, వెబ్‌డెస్క్ :
ప్రముఖ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ఆన్‌లైన్‌ కిరాణా వ్యాపారంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ‘జియోమార్ట్’ పేరుతో కిరాణా సేవల్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు కేవలం వెబ్‌సైట్, వాట్సాప్‌లోనే జియోమార్ట్ సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. బీటా వెర్షన్‌లోనూ కొంతమందికి మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాగా ప్రస్తుతం ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లందరికీ జియోమార్ట్ వినియోగంలోకి వచ్చేసింది. అంతేకాదు తన కస్టమర్లకు ఉచిత హోమ్‌ డెలివరీ సర్వీసులు కూడా అందిస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200 నగరాల్లో జియోమార్ట్‌. కామ్ ద్వారా సేవలు అందుబాటులో ఉండగా.. ఇకపై యాప్ ద్వారాను జియోమార్ట్‌లో ఆర్డర్ ఇవ్వొచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారులు గూగుల్‌ ప్లేస్టోర్, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి జియోమార్ట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా తమ కస్టమర్లకు ఎంఆర్‌పీపై 5 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతానికి గ్రాసరీ సేవలను మాత్రమే అందిస్తుండగా.. మరికొన్ని రోజుల్లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హెల్త్ కేర్, ఫార్మాసూటికల్ ప్రొడక్ట్స్ సైతం మార్ట్‌లో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్కెట్‌లకు జియోమార్ట్ గట్టిపోటీ ఇవ్వనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story