జియో కస్టమర్లకు గుడ్ న్యూస్

by vinod kumar |
జియో కస్టమర్లకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్:

రిలయన్స్ జియో తమ కస్టమర్లకు మరో సూపర్ ఆఫర్ ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను జియో వెబ్‌సైట్‌లో ఇటీవలే పోస్ట్ చేసింది. అదేంటంటే.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్ ను వన్ ఇయర్ వరకు అందించనున్నట్లు జియో టీజ్‌లో తెలిపింది. గతంలోనూ జియో తమ కస్టమర్లకు హాట్ స్టార్ వీఐపీ ఆఫర్ ను ఇచ్చింది. అయితే కొన్ని ప్లాన్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందా? లేక స్పెషల్ ప్యాకేజీ ఏమైనా లాంచ్ చేస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఆఫర్ కూడా ఎప్పటి నుంచి ఇవ్వనుందో కూడా తెలపలేదు. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వన్ ఇయర్ సబ్ స్క్రిప్షన్ రూ.399గా ఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్ వల్ల ఇండియన్ షోస్ లేటెస్ట్ ఎపిసోడ్లు అన్ని కూడా, అవి ప్రసారమయ్యే రోజూ ఉదయం ఆరు గంటలకే చూడవచ్చు. ఎయిర్ టెల్ కూడా తమ కస్టమర్లకు గత నెలలో సేమ్ ఇలాంటి ఆఫర్ నే తీసుకొచ్చింది. రూ. 401 ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తోంది. ఇప్పుడు జియో కూడా ఎయిర్ టెల్ కు పోటీగా ఈ ఆఫర్ ను తీసుకు వస్తున్నట్లు టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ మధ్యే జియో ఫైబర్ వినియోగదారులకు కూడా జియో టీవీ+ సర్వీస్ ద్వారా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను జియో అందించడం ప్రారంభించింది.

Advertisement

Next Story