- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నల్లమల ఏజెన్సీలో జియో నెట్‌వర్క్
దిశ, అచ్చంపేట : విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసుల నేపథ్యంలో నల్లమల ఏజెన్సీలో నెట్ వర్క్ సేవలను మెరుగుపరుచుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పూర్తిగా వెనుకబడిన ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలంలో నెట్వర్క్ సేవలు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు శనివారం జెడ్పీటీసీ రాంబాబు నాయక్ ఆధ్వర్యంలో జియో నెట్వర్క్ ప్రతినిధులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేశారు.
మండలంలోని వివిధ ప్రాంతాలలో జియో నెట్వర్క్ ఏర్పాటు చేయుటకు అటవీ ప్రాంతంలో సమస్యాత్మక ప్రదేశాలలో తిరుగుతూ ఉడిమిళ్ళ, మారేడుగు, ఇప్పలపల్లి, మద్దిమడుగు, చెన్నంపల్లి గ్రామాలలో నెట్వర్క్ సౌకర్యం కల్పించేందుకు పరిశీలన చేశారు. పై గ్రామాల పరిధిలో ఎన్ని కిలోమీటర్ల కేబుల్ సదుపాయం కలదు, ఎంత దూరం కేబులు కావాలి, రెవెన్యూ వారి స్థలము, ఫారెస్ట్ వాళ్ళు స్థానం విడివిడిగా పరిశీలించారు. అనంతరంఎన్ని మొక్కలు నష్టం జరుగుతుంది, ఎన్ని మీటర్ల లో కేబుల్ కనెక్షన్ కు గుంతలు తీయాలని పరిశీలించారు.
ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం కూడా ఆన్లైన్ క్లాసులు జరుగుతాయి కావున జియో, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పనులు త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ అధికారులను కోరారు. ముఖ్యంగా విద్యార్థులకు నష్టం జరుగుతుందని భావించి ఎప్పటికప్పుడు హైదరాబాద్ ఫారెస్ట్ అధికారులను, జియో ప్రతినిధులను కలుస్తున్నాం అని జడ్పీటీసీ తెలిపారు. అన్ని పరిశీలించిన తర్వాత మరోసారి సర్వే చేపడతామని ఫారెస్ట్ అధికారి తెలిపారు.