- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కర్ఫ్యూ టైమ్‌లో షూటింగ్.. హీరోతో సహా 35 మందిపై కేసు

దిశ, సినిమా : కరోనా సెకండ్ వేవ్‌తో దేశం అల్లాడుతోంది. రోజురోజుకూ కేసులు ఎక్కువ అవుతుండటం, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్రంలో సా.6 గంటల నుంచి ఉ. 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు అవుతోంది. అయితే ‘యువర్ హానర్’ సిరీస్ టీమ్ ఈ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించింది. పంజాబ్ లూధియానాలోని ఆర్య సీనియర్ సెకండరీ స్కూల్‌లో మంగళవారం రా. 8 గంటల తర్వాత షూటింగ్ చేశారు.
డైరెక్టర్ ఈశ్వర్ నివాస్, హీరో జిమ్మీ షేర్ గిల్‌తో పాటు దాదాపు 150 మంది టీమ్ ఈ షూటింగ్ హాజరయ్యారు. దీంతో ‘యువర్ హానర్’ టీమ్‌కు చెందిన 35 మందిపై కేసు ఫైల్ చేసిన పోలీసులు.. డైరెక్టర్ ఈశ్వర్ నివాస్‌తో పాటు క్రూ మెంబర్స్ ఆకాశ్ దీప్ సింగ్, మణిదీప్ సింగ్‌లను అరెస్ట్ చేశారు. అయితే ఈ ముగ్గురు కూడా బెయిల్ మీద బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.