- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీకర్ధమవుతుందా..? కట్నాల కోసమే వీళ్లు డాక్టర్లయ్యేది
దిశ,వెబ్‌డెస్క్: మీకర్ధమవుతుందా..? కట్నాల కోసమే వీళ్లు డాక్టర్లయ్యేది’ అంటూ జార్ఖండ్ ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ డాక్టర్ నితిన్ కులకర్ణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పలువురు డాక్టర్లు కొత్తగా అపాయిట్మెంట్ అయ్యారు. డాక్టర్లను ఉద్దేశించి జార్ఖండ్ ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ నితిన్ కులకర్ణి మాట్లాడుతూ వాళ్లు పనులు చేయరు. కానీ డాక్టర్లయ్యేది ఎందుకో తెలుసా..? కట్నాల కోసమేనని వ్యాఖ్యానించారు.
అయితే నితిన్ కులకర్ణి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ సీఎం హేమంత్ సోరెన్ కు లేఖ రాసింది. కరోనా క్రైసిస్ లో బాధితులకు ట్రీట్మెంట్ అందించే క్రమంలో 734 డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని లేఖలో పేర్కొన్నారు.
“జార్ఖండ్‌లో కొత్తగా నియమించుకున్న వైద్యులకు నియామక లేఖల పంపిణీ సందర్భంగా జార్ఖండ్ ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ డాక్టర్ నితిన్ కులకర్ణి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విచారం వ్యక్తం చేస్తుంది. ఇది వైద్య రంగానికి చాలా అవమానకరం. జార్ఖండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ (హెల్త్) చర్యను ఐఎంఎ ఖండించింది మరియు అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నామంటూ లేఖలో రాసింది.