- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చిరు సినిమాలో హా..హా.. హాసిని !

‘హా..హా.. హాసిని’ అంటూ బొమ్మరిల్లు సినిమాలో అల్లరిపిల్లగా నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన నటి జెనీలియా. హ్యాపీ, రెడీ, సై, శశిరేఖ పరిణయం లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్న జెనీలియా.. చివరగా రానాతో ‘నా ఇష్టం’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.
ప్రస్తుతం పిల్లలు స్కూల్‌కు వెళ్తుండగా.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో భర్తతో కలిసి టిక్‌టాక్ వీడియోలు కూడా చేస్తున్న ఈ భామకు.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే క్రేజీ చాన్స్ దక్కిందట.
మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘లూసిఫర్’ మూవీని చిరు రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రధాన పాత్ర కోసం జెనీలియాను సంప్రదించారట. వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన జెనీలియా.. ఈ సినిమా ద్వారానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.