జెన్ కో ఉద్యోగుల క్వార్టర్స్ ప్రారంభించిన సీఎండీ ప్రభాకర్

by Shyam |   ( Updated:2021-09-14 04:48:44.0  )
జెన్ కో ఉద్యోగుల క్వార్టర్స్ ప్రారంభించిన సీఎండీ ప్రభాకర్
X

దిశ, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు 1100 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగుల కోసం రూ.125 కోట్ల వ్యయంతో నిర్మించిన గృహ సముదాయాలను జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డితో కలిసి మంగళవారం ఉదయం ప్రారంభించారు. జెన్ కో సంస్థలో పనిచేసే ఉద్యోగుల సౌకర్యార్థం నిర్మించిన క్వార్టర్స్‌ను ఆయన ప్రారంభించారు. సంస్థలో పనిచేసే ఉద్యోగుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించడమే సంస్థ ధ్యేయమని తెలిపారు. అనంతరం 600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో రెండవ కన్వేయర్ బెల్ట్‌ను ప్రారంభించారు.

చాలా సంవత్సరాల తర్వాత జెన్కో ఎండీ ప్రభాకరరావు జెన్ కోను పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఆ తర్వాత జెన్కో సిబ్బందితో సమావేశమై ఇక్కడ జరుగుతున్న పరిస్థితులపై పూర్తి సమాచారం తెలుసుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. చాలా సంవత్సరాల తర్వాత భూపాలపల్లి జిల్లాలోని జెన్కోకు వచ్చిన సీఎండీ ప్రభాకర్ రావు పర్యటన వివరాలను సంస్థ అధికారులు గోప్యంగా ఉంచారు.

Advertisement

Next Story

Most Viewed