Amazon Founder Jeff Bezos : జులై 5న అమెజాన్ సీఈఓగా తప్పుకోనున్న జెఫ్ బెజోస్!

by Harish |   ( Updated:2021-05-27 10:50:25.0  )
Jeff bezos
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంచనల నిర్ణయం తీసుకున్నారు. అమెజాన్ సంస్థ సీఈఓ పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తానే స్వయంగా ప్రకటించారు. జులై 5న ఆయన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. 27 ఏళ్ల క్రితం ఇదే రోజున అమెజాన్ సంస్థ ప్రారంభమైందని, ఆరోజు నాకు సెంటిమెంట్ అని జెఫ్ బెజోస్ చెప్పారు. ప్రస్తుతం అమెజాన్ ఎగ్జిక్యూటివ్, వెబ్ సర్వీసెస్ హెడ్‌గా ఉన్న ఆండీ జెస్సీనికి కొత్త సీఈఓగా ఉండనున్నారు. 1997లో అమెజాన్ మార్కెటింగ్ మేనేజర్‌గా చేరిన ఆండీ జెస్సీ అప్పటినుంచి అనేక కీలక బాధ్యతలను చేపట్టారు. 2003లో అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ను ఏర్పాటు చేయడంలో ఆండీ కీలకంగా ఉన్నారు. బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత జెఫ్ బెజోస్ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు.

Next Story

Most Viewed