ఇవాళ్టి నుంచి JEE పరీక్షలు

by Anukaran |   ( Updated:2020-08-31 23:02:33.0  )
ఇవాళ్టి నుంచి JEE పరీక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్ :

కరోనా నేపథ్యంలో JEE, NEET పరీక్షలు వాయిదా వేయాలని రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలు పలుమార్లు కోరినా కేంద్రం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. మంగళవారం(ఈరోజు) నుంచి దేశవ్యాప్తంగా JEE పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ఈనెల 6వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు తొలిసెషన్, మధ్యాహ్నం 3నుంచి 6గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షల నిర్వహణ ఉండనుంది. అయితే, అభ్యర్థులు మాత్రం అరగంట ముందే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. శానిటైజర్, అడ్మిట్ కార్డు, ఐడీ కార్డు, వాటర్ బాటిల్‌ను సెంటర్‌లోనికి అనుమతించనున్నారు. మొత్తంగా 8.58 లక్షల మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారు.ఇక NEET ఎగ్జామ్ సెప్టెంబర్ 13న ప్రారంభం కానున్నది.

Advertisement

Next Story

Most Viewed