JEE Advanced 2021 -జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ వాయిదా..

by Anukaran |   ( Updated:2021-05-26 06:32:48.0  )
JEE Advanced 2021 -జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ వాయిదా..
X

న్యూఢిల్లీ: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్డ్ వాయిదా పడింది. (JEE Advanced 2021 Postponed Till Further Notice, New Date to be Announced Later) కరోనా ఉధృతిని దృష్టిలో పెట్టుకుని ఈ పరీక్షలను వాయిదా వేస్తు్న్నట్టు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రకటించింది. జులై 3న ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. సవరించిన పరీక్షా తేదీలను సరైన సమయంలో వెల్లడిస్తామని ఐఐటీ తెలిపింది. జేఈఈ మెయిన్ ఎగ్జామినేషన్‌ను క్లియర్ చేసిన టాప్ 2.5 లక్షల మంది అభ్యర్థులు మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్షలు రాయడానికి అర్హులు. ఇందులో రెండు పేపర్లు(పేపర్1, పేపర్ 2) ఉంటాయి.

దేశంలోని 23 ఐఐటీ కాలేజీల్లో బ్యాచిలర్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్, డ్యుయల్ డిగ్రీ కోర్సులకు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలే గేట్ వే. సాధారణంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను ఏడు జోనల్ ఐఐటీలు ఏడాదికోసారి వంతులవారీగా నిర్వహిస్తుంటాయి. జాయింట్ అడ్మిషన్ బోర్డు గైడెన్స్‌లో ఐఐటీలు వీటిని నిర్వహిస్తాయి. 2021 ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed