- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
JEE అడ్వాన్స్‌డ్.. విద్యార్థులకు మరో ఛాన్స్
దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా కారణంగా ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్ రాయలేకపోయిన విద్యార్థులకు జాయింట్ అడ్మిషన్ బోర్డు (JAB) మరో అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసి రాయలేకపోయిన విద్యార్థులందరూ వచ్చే ఏడాది ఈ పరీక్ష రాయడానికి అనుమతినిస్తూ మంగళవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
ఐఐటీలకు ప్రవేశం కల్పించే ఈ పరీక్షలు రాయడానికి విద్యార్థులకు సాధారణంగా రెండుసార్లే అవకాశముంటుంది. ఇప్పటికే ఒకసారి రాసి, మరోసారి దరఖాస్తు చేసి కరోనా కారణంగా రాయలేకపోయిన వారికీ ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే, వచ్చే ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేవారు మళ్లీ జేఈఈ మెయిన్స్ అర్హత సాధించాలన్న షరతును అమలు చేయడం లేదని పేర్కొంది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసినవారితో సమాన అవకాశాన్ని కల్పించినట్టవుతుందని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేఏబీ వెల్లడించింది.