- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమ్ ఆద్మీలోకి లక్ష్మీనారాయణ?
ఇటీవల జనసేన పార్టీకి గుడ్‌బై చెప్పిన లక్ష్మీనారాయణ రాజకీయ అడుగులపై ఏపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇన్నిరోజులపాటు కొత్తపార్టీ పెట్టబోతున్నారన్న అభిప్రాయాలు పాలిటిక్స్‌లో వినిపించినా అంతటితోనే ఆగిపోయాయి. అంతలోనే మళ్లీ బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చి కొద్దిగా ఆసక్తి పెంచినా సందిగ్ధంలోనే ఉంచాయి. పోలీస్ అధికారిగా పలు రాష్ట్రాల్లో పనిచేసిన టైంలో ఢిల్లీ పెద్దలతో ఆయనకు పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో బీజేపీలో చేరుతున్నారని టాక్ వినిపించినా ఆయన ఖండిస్తూనే వచ్చారు. కానీ, ఏపార్టీలో చేరుతానన్నది క్లారిటీ ఇవ్వలేదు. అప్పటి నుంచి మరుగున పడ్డట్లు కనిపించిన అంశం మళ్లీ తెరపైకి రావడంతో ఏపీలో రాజకీయం మళ్లీ ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీలో బంపర్ హిట్ కొట్టి మూడోసారి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో ఇటీవల జనసేనకు రాజీనామా చేసిన లక్ష్మీనారాయణకు టచ్‌లోకి వచ్చారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ అధికారిగా పనిచేసిన సమయంలో లక్ష్మీనారాయణకు మంచి ట్రాక్ రికార్డు ఉండటమే కాకుండా ఇప్పుడు రాజకీయాల్లోనే ఉండి ప్రజలకు సేవ చేయాలన్న భావన గట్టిగా ఉండటంతో ఆయన్ను ఆప్‌లోకి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ఆప్ నేతలు సైతం లక్ష్మీనారాయణతో ఫోన్‌లో మాట్లాడారని, ఈ విషయంపై ఆయన ఆసక్తిగానే చర్చించినప్పటికీ చివరి నిమిషంలో క్లారిటీ ఇవ్వలేదని ప్రచారం గుప్పుమంటోంది.
ఈ నేపథ్యంలోనే లక్ష్మీనారాయణ ఇతర పార్టీల్లోకి వెళ్తే వారి విధానాలు నచ్చకుంటే మళ్లీ పార్టీని వీడే అవకాశాలు రావొచ్చని భావిస్తున్న నేపథ్యంలో.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరితే సొంతంగా ఎదగడంతోపాటు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయొచ్చన్న నిర్ణయానికి లక్ష్మీనారాయణ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజకీయశ్రేణుల నుంచి మరో కొత్త విషయం కూడా వినపడుతోంది. ఏపీలో ఏమాత్రం క్యాడర్‌లేని ఆమ్ ఆద్మీలో చేరి ఏవిధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తాడన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అటు జనసేన నుంచి బయటకు రావడమే కాకుండా ఇప్పుడు టీడీపీ, బీజేపీలోకి వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో లక్ష్మినారాయణ కొత్తపార్టీ పెడతారా లేకుంటే ఆమ్ ఆద్మీలో చేరి రాజకీయ భవిష్యత్‌ను వెతుక్కుంటారా.. అన్నది కీలకంగా మారింది.