- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దిశ’ ఎఫెక్ట్.. కాట్రపల్లికి జేసీ హరిసింగ్.. గోల్‌మాల్‌పై విచారణకు ఆదేశం
దిశ ప్రతినిధి, వరంగల్ : కాట్రపల్లి ఐకేపీ సెంటర్లో జరిగిన అక్రమాల విషయమై ‘కొనుగోలు లీలలు’ పేరుతో ‘దిశ’ పత్రికలో వార్తా కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇందుకు స్పందించిన జిల్లా యంత్రాంగం జాయింట్ కలెక్టర్ హరి సింగ్ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించినట్లు సమాచారం. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కాట్రపల్లి ఐకేపీ సెంటర్లో రూ.28 లక్షల అక్రమాలు జరిగినట్లు పక్కా ఆధారాలు ఉన్నట్లు అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ విచారణ అనివార్యమైంది.
ఎంపీటీసీ భర్త రఘు సింగ్ కొంత మంది రైతుల పేరుతో ధాన్యం అమ్మకాలు చూపి నగదు తన అకౌంట్లో జమయ్యాలా చేసుకున్నాడు. కొంతమంది బినామీ పేర్లతో అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మరికొంత మంది రైతుల పేర్లు వినియోగించుకుని తన అకౌంట్లో నగదు జమయ్యేలా చేసుకున్నాడు. రఘు సింగ్ తల్లి సమ్మక్కే కేంద్రం నిర్వాహకురాలు కావడంతో రఘు సింగ్ ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. రైతులకు ఇతర బ్యాంకుల్లో అప్పులు ఉండటంతో వాళ్లు చెబితేనే తన అకౌంట్లో డబ్బులు జమయ్యేలా చేసినట్లు చెప్పడం గమనార్హం.
అయితే, ధాన్యం విక్రయించిన కొంతమంది రైతులకు వారి అకౌంట్లో డబ్బులు జమ కాగా, వారికి తెలియకుండానే వారి పేరు వివరాలు వినియోగించుకుని అకౌంట్ నెంబర్ తనది యాడ్ చేసి అధికారులకు రఘుసింగ్ మస్కా కొట్టాడు. దిశలో ప్రచురించిన కథనం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో జేసీ హరిసింగ్ గురువారం కాట్రపల్లి రైతులతో మాట్లాడేందుకు వెళ్తున్నట్లు సమాచారం.