- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జగన్ కి నోటీసులు ఇవ్వాలంటే లారీలు కావాలి : జేసీ దివాకర్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మంగళవారం ఉదయం సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు నోటీసులివ్వడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మాజీ ఎంపీ, టీడీపీ కీలక నేత జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. మంగళవారం నాడు తెలంగాణ సీఎల్పీలో కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన జేసీ అనంతరం మీడియాతో మాట్లాడారు. మా సీఎం.. మా వాడు అంటూ జగన్ పై సెటైర్లు వేశారు.
చంద్రబాబుకు ఒక్క కానిస్టేబుల్ మాత్రమే వెళ్లి ఒకే ఒక్క నోటీసు ఇచ్చాడు అని అదే మా సీఎం వైఎస్ జగన్ కి అయితే లారీలు కావాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వాలన్నా లారీలు లారీలు కావాలంటూ ఎద్దేవా చేశారు. దొనకొండ లేదా వైజాగ్ ను రాజధాని చేయాలని చంద్రబాబుకు తాము ఆనాడే చెప్పామని గుర్తు చేశారు. ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత మార్చడం సరికాదని ఆయన చెప్పారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. నోటీసులపై ఎలా ముందుకెళ్లాలి..? విచారణకు వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై చంద్రబాబు నాయుడు సన్నిహితులు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత నారాయణకు కూడా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.