ఏపీ అసెంబ్లీలో రేపు జరిగేదిదే: జేసీ జోస్యం

by srinivas |
ఏపీ అసెంబ్లీలో రేపు జరిగేదిదే: జేసీ జోస్యం
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగేదేమీ ఉండదని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు పంపి, ప్రభుత్వానికి అవసరమైన
బిల్లులు పాస్ చేసుకుంటారని అన్నారు.

కేసులు ఉన్నా, లేకపోయినా ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టాలనేదే వైఎస్సార్సీపీ యోచనని తెలిపారు. రవాణాశాఖ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిల పేర్లు లేకపోయినా, ఇబ్బంది పెట్టాలనే వారిని అరెస్ట్ చేశారని ఆరోపించారు.

తనను కూడా ఏదో ఒక కేసులో ఇరికించి లోపలేస్తారని చెప్పారు. వాహనాలను అమ్మిన వారిని, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను వదిలేసి, తమ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టారని దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్ పిటిషన్ వేస్తున్నామని, బెయిల్ వస్తుందని చెప్పారు. తమ కుటుంబంపై ఎంతటి ప్రేమాభిమానాలు ఉన్నాయో చెప్పేందుకే నారా లోకేశ్ తమ ఇంటికి వచ్చారని జేసీ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story