- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మీరెవరు నా బెడ్రూంలోకి రావడానికి : జేసీ దివాకర్ రెడ్డి
by srinivas |

X
దిశ, ఏపీబ్యూరో : పోలీసులపై టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి శివాలెత్తారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం జూటూరు ఫామ్ హౌస్‌లో ఉన్న దివాకర్ రెడ్డిని సోమవారం హౌస్ అరెస్ట్ చేసేందుకు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు వెళ్లారు. బెడ్ రూమ్‌లోకి పోలీసులు వెళ్లడంతో జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరు సరిగ్గా లేదంటూ మండిపడ్డారు.
దీంతో డీఎస్పీ శ్రీనివాసులు, జేసీకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులపై దూషణలకు దిగొద్దని, అది మంచి పద్ధతి కాదని శ్రీనివాసులు హితవు పలికారు. నోటి దురుసుతో తగ్గించుకోవాలని సూచించారు. దీంతో జేసీ మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఇంట్లోకి రావడానికి వారెవరు అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఊగిపోయారు.
Next Story