- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రోహిత్ దగ్గర అన్ని జట్ల సమాచారం: జయవర్ధనే

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 12 సీజన్లు జరగ్గా అతడి నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్ నాలుగుసార్లు టైటిల్ గెలిచింది. కాగా, రోహిత్ విజయ రహస్యాన్ని ఆ జట్టు కోచ్, శ్రీలంక మాజీ బ్యాట్స్‌మన్ మహేలా జయవర్ధనే బయటపెట్టాడు. సోనీ స్పోర్ట్స్ నిర్వహించిన ఒక చర్చాగోష్టిలో మాట్లాడిన మహేలా ‘రోహిత్ కెప్టెన్సీ చాలా వినూత్నంగా ఉంటుంది. అతని వద్ద ఎవరికీ తెలియని రహస్యాలు ఉంటాయి. ప్రత్యర్థి జట్టులోని ప్రతి ఆటగాడికి సంబంధించిన బలహీనతలు, బలాలకు సంబంధించిన సమాచారం అతని వద్ద ఉంది. అతనో పట్టుదల కలిగిన నాయకుడు. కాబట్టే తనకు తెలిసిన మార్గాల ద్వారా ఈ సమాచారం అంతా దగ్గర పెట్టుకున్నాడు. ఆ సమాచారంతోనే మైదానంలోకి దిగిన వెంటనే తన ప్రణాళికలు అమలు చేయడం మొదలు పెడతాడు. కొన్నిసార్లు అతని అంచనా తప్పవచ్చు. కానీ, అత్యధిక శాతం విజయాలు రోహిత్ నాయకత్వ ప్రతిభ ఆధారంగానే వచ్చాయి’ అని జయవర్ధనే స్పష్టం చేశాడు. ముంబయి ఇండియన్స్ జట్టుకు 104 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ నాయకత్వం వహించగా 60 సార్లు విజయాన్ని సాధించి పెట్టాడు. చాలా సీజన్లలో వెనుకబడిన ముంబయి జట్టును ఫైనల్స్‌కు చేర్చి టైటిల్స్ సాధించాడు. ముంబయి ఇండియన్స్ జట్టును నడిపించిన తీరుతోనే అతను పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్‌ఇండియా వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడని విశ్లేషకులు చెబుతుంటారు.