ఆ యూనివర్సిటీ ఆన్‌లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్..!

దిశ, వెబ్‌డెస్క్ :

ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ రాష్ట్ర వ్యవ‌సాయ విశ్వవిద్యాల‌యం 2020-21 ఏడాదికి BSC (హాన‌ర్స్‌), B-tech (అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్‌) ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని ప్రకటించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలని సూచించారు. 04-10-2020ను దరఖాస్తుకు చివరి తేదిగా నిర్ణయించారు.
పూర్తి వివరాల కోసం https://www.pjtsau.edu.in/ సంప్రదించాలని అధికారులు వెల్లడించారు.

ఆఫర్ చేస్తున్న కోర్సులు : BSC (హాన‌ర్స్‌), B-tech (అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్‌) Seats : Bsc (హాన‌ర్స్‌)-65, B-tech (అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్‌)- 7.
అర్హ‌త‌ : Diploma(అగ్రిక‌ల్చ‌ర్‌, సీడ్ టెక్నాల‌జీ, ఆర్గానిక్ అగ్రిక‌ల్చ‌ర్‌), Diploma (అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణ‌త‌ తప్పనిసరి. 2019-20 విద్యాసంవ‌త్స‌రం వారూ అర్హులేనని ప్రకటించింది.

ఎంపిక విధానం : ఆన్‌లైన్ కంప్యూట‌ర్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ప‌రీక్ష తేది : అక్టోబర్‌ 13, 2020. పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌. ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు : ఓసీ, బీసీలకు రూ.1200, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.600. ద‌ర‌ఖాస్తు చేయడానికి చివ‌రి తేది : అక్టోబర్‌ 04, 2020. వెబ్‌సైట్‌ : https://www.pjtsau.edu.in/ సంప్రదించాలని కోరారు.

Advertisement