మావోయిస్టు క్యాంపులో కోబ్రా జవాన్

by Shamantha N |
మావోయిస్టు క్యాంపులో కోబ్రా జవాన్
X

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్ తర్వాత ఇప్పుడు ఫోకస్ మిస్సింగ్ జవాన్‌పైకి మళ్లింది. కోబ్రా జవాన్ తమ దగ్గర సురక్షితంగా ఉన్నాడని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ మధ్యవర్తులను ఏర్పాటుచేస్తే వారికి అప్పగిస్తామని వివరించింది. తాజాగా, మావోయిస్టులు వాళ్ల అదుపులో ఉన్న జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ఫొటోను విడుదల చేశారు. ఓ ప్లాస్టిక్ మ్యాట్‌పై తాటి కొమ్మలతో వేసిన తాత్కాలిక గూడు కింద కూర్చున్న సింగ్‌ ఆ ఫొటోలో కనిపించారు. ఆ గూడు బహుశా మావోయిస్టుల తాత్కాలిక షెల్టర్ అయి ఉంటుందని భావిస్తున్నారు. జవాన్ సింగ్ తమ దగ్గరే ఉన్నాడని సోమవారం కొందరు జర్నలిస్టులకు ఫోన్ కాల్స్ వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed