- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నావికా కేంద్రంలో జవాన్ సూసైడ్
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: డిఫెన్సు సెక్యూరిటీకి చెందిన నావికా కేంద్రంలో తన సర్వీసు రైఫిల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ జవాను. ఈ ఘటన ముంబయి నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఘట్కోపర్ ప్రాంతంలోని నావికా దళం స్టోర్సులో సిపాయి రాయ్‌పాల్ సింగ్ అనే జవాను.. తన సర్వీసు రైఫిల్‌తో రెండు రౌండ్లు కాల్చుకున్నాడు. కాల్పుల శబ్ధం విన్న నావికాదళం సిబ్బంది.. రాయ్‌పాల్ సింగ్‌ను హుటాహుటిన రాజవాడి సివిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. పంజాబ్ జిల్లా సంగ్రూరు జిల్లాకు చెందిన మృతుడు సిపాయి రాయ్‌పాల్ సింగ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు జవాన్ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Next Story