కూరగాయలు అమ్ముతున్న అమీర్‌ఖాన్ దోస్త్

ఏ పని కూడా చిన్నది కాదని అంటుంటారు పెద్దలు. కడుపు నింపే, కష్టపడిచేసే ప్రతీ పని.. గౌరవప్రదమైనదేనని చెప్తుంటారు. ఈ సామెతను చాలా మంది లెజెండ్స్ ఫాలో అయ్యారు. ‘గులాబ్’ సినిమాలో అమీర్‌ఖాన్‌తో కలిసి నటించిన జావేద్ హైదర్.. సైతం ఇప్పుడు ఇదే సిద్ధాంతాన్నే ఫాలో అవుతున్నాడు. లాక్‌డౌన్ టైమ్‌లో షూటింగ్స్ లేకపోవడంతో కూరగాయలు అమ్ముతున్నాడు. అఫ్‌కోర్స్ ఇదంతా కేవలం టిక్‌టాక్ కోసమే చేసినా.. ఇందులో సందేశం మాత్రం అదే అంటున్నాడు.

ఇప్పటికే ఈ వీడియో వైరల్ అయిపోగా.. తను కూరగాయలు అమ్మే విధానాన్ని భలే ఇష్టపడుతున్నారు నెటిజన్లు. ఇలా కూడా ఎంటర్‌టైన్ చేయొచ్చని జావేద్ హైదర్ నిరూపించాడని ప్రశంసిస్తున్నారు.

Advertisement