చివరి మ్యాచ్‌ నుంచి బుమ్రా తప్పుకున్నాడు

by Shiva |   ( Updated:2021-02-27 09:59:37.0  )
చివరి మ్యాచ్‌ నుంచి బుమ్రా తప్పుకున్నాడు
X

దిశ, స్పోర్ట్స్ : పేటీఎం టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరగనున్న చివరి మ్యాచ్ నుంచి టీమ్ ఇండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రాను తప్పించారు. తనకు విశ్రాంతి కావాలని బుమ్రా కోరడంతోనే బీసీసీఐ ఆ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. అయితే బుమ్రా జట్టు నుంచి వైదొలిగినా.. అతడి స్థానంలో మాత్రం వేరే క్రికెటర్‌ను తీసుకోవడం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇంగ్లాండ్ సిరీస్‌లో తొలి టెస్టులో ఆడిన బుమ్రాకు బీసీసీఐ రెండో టెస్టులో విశ్రాంతిని ఇచ్చింది. మూడో టెస్టులో బుమ్రా ఆడినా.. ఆ పిచ్ మొత్తం స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో బుమ్రా పెద్దగా ప్రభావం చూపించలేదు. తాజాగా తనకు నాలుగో టెస్టు నుంచి విశ్రాంతి కోరడంతో బీసీసీఐ అంగీకరించింది. ప్రస్తుత సిరీస్‌లో టీమ్ ఇండియా 2-1 తేడాతో ముందంజలో ఉన్నది. చివరి టెస్టు డ్రా చేసినా, గెలిచినా టీమ్ ఇండియా ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ చేరే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story