- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బచ్చన్ పాండేతో జాక్వెలిన్ ఫన్ రైడ్
దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ‘బచ్చన్ పాండే’ టీమ్‌తో జాయిన్ కాబోతుంది. అక్షయ్ కుమార్, కృతి సనన్, అర్షద్ వార్షి నటిస్తున్న ఈ సినిమాలో మరోసారి అక్షయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేసిన జాక్వెలిన్.. అక్షయ్‌తో ఫన్ రైడ్ జర్నీ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ‘హౌజ్ ఫుల్’ ఫ్రాంచైజ్, ‘బ్రదర్స్’ లాంటి సినిమాల్లో కిలాడీతో జోడీ కట్టిన భామ.. తనతో వర్క్ చేయడం ఫన్‌గా ఉంటుందని తెలిపింది. ప్రొడ్యూసర్ సాజిద్ నడియావాలాతో ఎనిమిదోసారి కాంబినేషన్ రిపీట్ చేస్తుండగా.. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సాజిద్‌తో పనిచేయడం అంటే మనసు ఉప్పొంగిపోతుందని చెప్పింది.
కాగా ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్ అక్షయ్ హీరో కావాలని, జర్నలిస్ట్ కృతి డైరెక్టర్‌గా సెటిల్ అయిపోవాలని కలలు కంటుంటారని ఇప్పటికే రివీల్ చేయగా.. మరి జాక్వెలిన్ డ్రీమ్ ఏంటి? అనేది త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. జనవరి 6 నుంచి జైసల్మేర్‌లో షూటింగ్ ప్రారంభం కానుండగా.. రెండు నెలల లాంగ్ షెడ్యూల్‌లో మేజర్ పోర్షన్ కంప్లీట్ చేయనున్నారు. కాగా ఫర్హాద్ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ డ్రామా.. 2021 చివరలో రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది.