పొడవాటి జుట్టున్న ‘ఆమె’.. ట్రెండ్ సెట్టర్!

by Sujitha Rachapalli |   ( Updated:2021-03-09 06:58:42.0  )
6-feet, 3-inch Long Locks,
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోనే టీనేజ్‌లో అత్యంత పొడవైన జుట్టును(5.7 అడుగుల కురులు) కలిగివున్న అమ్మాయిగా గుజరాత్‌కు చెందిన నీలాన్షీ పటేల్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈమె కంటే ఎక్కువ పొడవాటి జుట్టు(6.3 అడుగులు)తో జపాన్‌లోని టోక్యోకు చెందిన రిన్ కంబె నయా ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇంత పొడవు జుట్టును పెంచేందుకు ఆమె 15 ఏళ్ల నుంచి హెయిర్ కట్ చేయించుకోకపోవడం విశేషం.

కాగా మోడల్, డ్యాన్సర్ అయిన 35 ఏళ్ల రిన్ కంబె.. స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకోవడం కోసమే ఇలా చేశానని చెప్తోంది. ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా రాణించాలంటే కురులే ముఖ్యమని, కానీ చిన్నప్పుడు తన పేరెంట్స్ జుట్టు పెంచుకోవద్దని పరిమితులు విధించేవారని తెలిపింది. సోషల్ మీడియాలో బోలెడు మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకునేందుకు తన జుట్టు దోహదపడిందని పేర్కొంది. ఎప్పటికప్పుడు తన లైవ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటానని, ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తాయని వివరించింది. కొందరు నెటిజన్లు ఏకంగా ‘జుట్టురాక్షసి’ అని కామెంట్స్ చేస్తారని చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed