- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్ మాఫియాకు అడ్డా ‘ఏపీ’.. Pawan Kalyan సంచలన కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్, బాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల కేసులు దుమారం రేపుతున్నాయి. తాజాగా విజయవాడ అడ్రస్‌తో వస్తున్న ఓ కంటైనర్.. గుజరాత్‌లో హెరాయిన్‌తో పట్టుబడటం ఏపీని ఉలిక్కిపడేలా చేసింది. తెలంగాణ, కర్ణాటక పోలీసులు సైతం ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందన్న పవన్.. దేశంలో పట్టుపడుతున్న డ్రగ్స్ కేసులకు ఏపీలోనే మూలాలున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి ఢిల్లీ, రాజస్థాన్, పుణె, ముంబై, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, హైదరాబాద్‌తో పాటు పలు రాష్ట్రాల పోలీసులు వీడియో స్టేట్‌మెంట్స్‌ను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘గంజాయి సాగు నిజంగా సామాజిక ఆర్థిక అంశం. విశాఖ మన్యం నుంచి తుని వరకు చదువు పూర్తయ్యి ఉపాధి లేని కుర్రాళ్లు ఇందులో చిక్కుకుంటున్నారు. కింగ్ పిన్స్ మాత్రం రిస్క్ లేకుండా సంపాదిస్తున్నారు. మన్యంలో ఇప్పుడు గంజాయి పంట ముఖ్య దశలో ఉంది. నవంబర్, డిసెంబర్ నుంచి కటింగ్ మొదలవుతుంది. అపుడు ఇంకా ఎక్కువ బయటకు వెళ్తుంది. గతంలో గంజాయి పంటను పోలీసులు, అబ్కారీ అధికారులు ధ్వంసం చేసేవారు. ఆ పని వదిలి.. బయటకు వెళ్లే గంజాయిని పట్టుకుంటున్నారు. ఇక్కడ సీజ్ చేసినదాని కంటే రాష్ట్రం దాటిపోతున్న సరుకే ఎక్కువగా ఉంటుంది’ అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.