అమరావతిపై న్యాయపోరాటం: పవన్

Pawan

దిశ, వెబ్ డెస్క్: రాజధాని రైతులకు అండగా ఉండాలని జనసేనాని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈమేరకు ఆదివారం జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతిపై పార్టీ తరుపున న్యాయపోరాటం చేస్తామన్నారు.

అమరావతిపై టీడీపీ ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల ప్రచారంలో అమరావతిలోనే ఇళ్లు కట్టుకుని.. ఇక్కడే ఉంటానని చెప్పిన జగన్ ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాడుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement