‘బూతుల మంత్రిని.. జోకర్ మంత్రిని దేవుడు శిక్షిస్తాడు’

by srinivas |
Janasena party spokesperson pothina Mahesh
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొడాలి నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలపై మహేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పవన్ కళ్యాణ్ గుడివాడ నడిబొడ్డున నిల్చుని మంత్రి పేకాట శిబిరం నిర్వహిస్తున్నారని వాస్తవాలే చెప్పారు. దీనిపై బూతుల మంత్రి.. స్వాతి ముత్యం లాగా.. పేకాట శిబిరాలు మూసివేశామని గొప్పలు చెప్పుకున్నారు. నిన్నటి‌వరకు బూతుల మంత్రిగా ఉన్న ఆయన నేటి నుంచి కోత ముక్క కింగ్‌గా పిలుస్తున్నాం. పేకాట శిబిరాలపై నిర్వహించిన దాడుల్లో పట్టుబడిన ఆయన ప్రధాన అనుచరులను తప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో విజయ్, సురేంద్రలు కీలకంగా ఉన్నారు. వారికోసం ఉదయాన్నే కొడాలి నాని తాడేపల్లి రాజ ప్రసాదానికి పరుగులు పెట్టారు. పోలీసులు ఎంతో‌ ధైర్యంగా దాడులు చేయడం అభినందనీయం. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వారందరకీ జనసేన తరపున కృతజ్ఞతలు. అంతేగాకుండా డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రెస్ మీట్ పెట్టి.. పేకాట శిబిరం వెనుక ఉన్న వారి వివరాలు వెల్లడించాలి.’’

అంతేగాకుండా.. ’’ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. మంత్రి కొడాలిపై చర్యలు తీసుకోవాలి. బాపట్ల, నిజాంపట్నంలో భారీ పేకాట శిబిరం జరుగుతుంది. స్వయంగా వీటిని ఎంపీ సురేష్, మోపిదేవి శ్రీనివాస్‌లు వీటిని నడుపుతున్నారు. నందివాడ మండలంలో తాగునీరు ఇప్పించలేని బోడి లింగం మంత్రి నాటుసారాను ఏరులై పారిస్తూ.. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఖైదీసాబ్ పాలనలో గుళ్ల ముందు కొబ్బరి చిప్పలు ఏరుకునే వారు మంత్రిగా ఉంటే ఇలానే ఉంటుంది. మచిలీపట్నంలో మరో బోడి లింగం మంత్రి అక్రమాలను త్వరలో ఆధారాలతో బయట పెడతాం. విజయవాడలో మరో జోకర్ మంత్రి ఉన్నాడు. ఆ దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. నిన్న సీతాదేవి విగ్రహం కూలగొట్టినా మాట్లాడలేదు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నా.. స్పందించని బూతుల మంత్రిని, దేవాదాయ శాఖలో ఉన్న దద్దమ్మ మంత్రిని సీఎం జగన్ బర్తరఫ్ చేయాలి. జోకర్ మంత్రి వెల్లంపల్లిని సీఎం దండించక పోయిన అమ్మవారు దండిస్తుంది. వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలో సారా తయారీ, పేకాట క్లబ్‌లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్‌ చేస్తున్నాం’’ అని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed