- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరంజీవి రాజకీయ జీవితంపై పవన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కాపు సంక్షేమ సమావేశానికి హాజరైన పవన్, చిరంజీవి రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా చిరంజీవి నైతిక మద్దతు నాకు ఎప్పుడూ ఉంటుందని, తమ్ముడిగా నా విజయాన్ని కోరుకునే వ్యక్తి చిరంజీవి అన్నారు. అంతేగాకుండా అన్నయ్య పార్టీలోకి వస్తారా..? లేదా? అన్నది ఇప్పుడే ఏం చెప్పలేను అని తెలిపారు. అన్నయ్య చిరంజీవి అందరి మంచి కోరుకునే వ్యక్తి అని.. అందులో ఎలాంటి సందేహం లేదని వెల్లడించారు. రాజకీయాల్లో ఎప్పడైనా తాను విజయం సాధించాలనే కోరుకుంటారు తప్పా ఓడిపోవాలని అనుకోరు అని అన్నారు. జనసేనలో చేరడం అనేది చిరంజీవి అభిప్రాయం.. అన్నయ్య జనసేనలో చేరిక పరిస్థితులను బట్టి ఉంటుందని తెలిపారు.
అంతేగాకుండా.. ఇన్నేళ్ల రాజకీయాల్లో కాపులను ఎప్పుడూ విభజించి పాలించారని, శాసించే స్థాయిలో ఉండాల్సినవారు యాచించే స్థాయిలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ కులానికి, ప్రాంతానికి పరిమితం కాదు అని.. కాపుల న్యాయపరమైన సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సంఖ్యాబలం ఉండి కూడా కాపులు నిరాదరణకు గురవుతున్నారని అభిప్రాయపడ్డారు. నా మనసులో మానవత్వం మాత్రమే ఉంటుందని అన్నారు.