ప్రకృతి వ్యవసాయంతో మేలు: పవన్

దిశ, వెబ్‌డెస్క్: యువతకు.. రైతాంగానికి మేలు చేకూర్చేలా ప్రకృతి వ్యవసాయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. 250 గజాల్లో 81 మొక్కలతో ఫలసాయం పొందే విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించబోతున్నామని ఆయన తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా.. ప్రముఖ ప్రకృతి రైతు విజయరామ్ సలహాలతో శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు చేపడుతామన్నారు.

Advertisement