ముందు వారికి న్యాయం చేయండి: పవన్

దిశ, వెబ్‌డెస్క్: గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సీఎం జగన్ నిర్వాసితులకు భరోసా ఇవ్వాలని సూచించారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట రిజర్వాయర్ ఫేజ్‌ 2లో 23 టీఎంసీల నీటిని నిల్వ సామర్థ్యం పెంచే పనులను నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే మొదలు పెట్టాలని స్పష్టం చేశారు.

ఫేజ్ కోసం 16 గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తమకు పునరావాస వసతులు కల్పించాలని నిరసన చేసిన వారి పై పోలీలసుల బెటాలియన్ పంపడం పద్ధతి కాదన్నారు. ఈ విషయం పై ప్రభుత్వం న్యాయం చేసేవరకు జనసేన పోరాటం సాగిస్తోందని పవన్ తేల్చి చెప్పారు.

Advertisement