గ‌ృహ నిర్బంధం నుంచి సాజద్ లోనె విడుదల

by  |
గ‌ృహ నిర్బంధం నుంచి సాజద్ లోనె విడుదల
X

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చిన ఆర్టికల్ 370 నీరుగార్చిన తర్వాత నిర్బంధంలోకి తీసుకున్న పీపుల్స్ కాన్ఫరెన్స్ రాజకీయ పార్టీ చీఫ్ సాజద్ లోనెను శుక్రవారం విడుదల చేశారు. ఐదు రోజులు తక్కువ ఏడాది తర్వాత అతనిపై విధించిన నిర్బంధాన్ని తొలగించి స్వేచ్ఛనిచ్చినట్టు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

జైలు తనకు కొత్త అనుభవమేమీ కాదని తెలిపారు. అయితే, గతంలో భౌతిక వేధింపులుండేవని, తాజా నిర్బంధం మానసికంగా కుంగదీసే రకమైనదని వివరించారు. గతేడాది ఆగస్టు మొదలు ఆరు నెలలపాటు సాజద్ లోనె డిటెన్షన్ సెంటర్‌కు తరలించగా, ఫిబ్రవరి 5 నుంచి తర్వాతి ఆరునెలలు గృహ నిర్బంధంలో ఉంచారు. సాజద్ విడుదలపై జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతోషాన్ని వ్యక్తపరిచారు. చట్టవ్యతిరేక గృహ నిర్బంధం నుంచి సాజద్ విడుదలైన వార్త సంతోషాన్నిస్తున్నదని, ఇదే తరహాలో అక్రమంగా నిర్బంధించినవారినీ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed