- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియాలో జేమ్స్‌బాండ్ 3D.. ఫ్యాన్స్‌కు పండగే
దిశ సినిమా: ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న జేమ్స్‌బాండ్ చిత్రం ‘నో టైమ్ టు డై’.. డేనియల్ క్రేగ్ బాండ్‌గా నటించిన ఈ మూవీ ఈ నెల 30న విడుదల కానుండగా.. చిత్రానికి సంబంధించిన మరో తాజా వార్త వెలువడింది. పవర్‌ఫుల్ స్టంట్లతో ఆకట్టుకునే ఈ చిత్రాన్ని 3Dలో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా 3Dలో విడుదల చేయడానికి ఇబ్బందులు లేకపోయినా.. మనదేశంలో ఇంకా చర్చలు నడుస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న వార్నర్ బ్రదర్స్ సంస్థకి, మల్టీప్లెక్స్ నిర్వాహకులకు మధ్య చర్చలు సాగుతున్నాయి.
3D చిత్రం కోసం ప్రేక్షకుల నుంచి వసూలు చేసే మొత్తంలో కొంత వార్నర్ బ్రదర్స్‌కి ఇవ్వాలని ఆ సంస్థ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కానీ మల్టీప్లెక్స్ నిర్వాహకులు అందుకు అంగీకరించలేదట. గతంలోనూ పలు హాలీవుడ్ చిత్రాల విషయంలో ఇదే సమస్య ఎదురైంది. ఆయా చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా 3Dలో విడుదలైనా మన దేశంలో టుడీలోనే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే భారతీయ ప్రేక్షకులు బాండ్ సినిమాని 3Dలో చూసే చాన్స్ ఉంది.
- Tags
- 3D
- James bond