Cpl తొలి విజేత జమైకా తల్లవాస్

by  |
Cpl తొలి విజేత జమైకా తల్లవాస్
X

దిశ, స్పోర్ట్స్ :

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (Cpl)లో విండీస్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ (Andru russel) బాదుడు ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసు. కోల్‌కతా నైట్ రైడర్స్ (kkr) జట్టు సభ్యుడిగా ఎన్నో మ్యాచ్‌లు ఒంటి చేత్తో గెలిపించాడు. అలాంటి రస్సెల్ కెప్టెన్సీలో ఈసారి కరేబియర్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది జమైకా తల్లవాస్ (Jamika tallavas). 2013లో సీపీఎల్ ప్రారంభ సీజన్ విజేతగా నిలిచింది. కరేబియన్ దీవుల్లోని జమైకా దేశానికి ప్రాతినిథ్యం వహించే ఈ జమైకా తల్లవాస్ జట్టు, రేటింగ్‌లో ప్రతి ఏడాది టాప్‌లోనే నిలుస్తున్నది. 2013 తర్వాత 2016లో మరోసారి టైటిల్ గెలిచి సీపీఎల్‌లో అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన రెండో జట్టుగా రికార్డు సృష్టించింది. అయితే, గత రెండు సీజన్లుగా నాలుగో స్థానంతోనే సరిపెట్టుకున్న జమైకా జట్టు ఈసారి టైటిల్ గెలిచి పూర్వవైభవాన్ని కొనసాగించాలనే కసితో ఉన్నది.

లోకల్ టాలెంట్..

సీపీఎల్‌లో విదేశీ క్రీడాకారులను తెచ్చుకునే వెసులు బాటు ఉన్నా జమైకా తల్లవాస్ ఎక్కువగా స్థానిక క్రీడాకారుల(Local criketers)) మీదే ఆధారపడింది. విదేశీ క్రీడాకారులు జట్టులో ఉన్నా, స్థానికులకు ఎక్కువగా అవకాశాలు ఇస్తుండటంతో ఈ ఫ్రాంచైజీకి లోకల్‌గా అభిమానులు(Lcoal fans) ఎక్కువ. వెస్టిండీస్ జాతీయ జట్టులో హార్డ్ కోర్ హిట్టర్లుగా పేరొందిన ఎంతో మంది క్రికెటర్లు జమైకా జట్టులో ఉన్నారు.

దీంతో ఈ జట్టును సరదాగా హిట్టర్స్ స్క్వాడ్ అని పిలుస్తుంటారు. ఆండ్రీ రస్సెల్‌తో పాటు కార్లోస్ బ్రాత్‌వెయిట్, రోవ్‌మాన్ పావెల్, జెర్నానీ బ్లాక్‌వుడ్, ఆండ్రీ మెక్‌కాథీ లాంటి వారితో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉంది. నేపాల్‌(nepal)కు చెందిన సందీప్ లమిషానే, సౌతాఫ్రికా(south africa)కు చెందిన తబ్రెజ్ షంశీ, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ముజీబుర్ రహమాన్‌ల బౌలింగ్ లైనప్ కూడా ప్రత్యర్థులను హడలెత్తించే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా జమైకా తల్లవాస్ జట్టు తమ హోం గ్రౌండ్‌ అయిన సబీనా పార్క్‌లో తిరుగు లేని జట్టుగా రికార్డుల కెక్కింది. ఒక సీజన్‌లో ఆరింటికి ఐదు హోం మ్యాచ్‌లు గెలిచి రికార్డు సృష్టించింది. మరోసారి విదేశీ ఆటగాళ్లు లేకుండా మొత్తం స్థానిక క్రికెటర్లతోనే మ్యాచ్ ఆడి ఆశ్చర్యపరిచింది.

గెలుపే లక్ష్యంగా..

సీపీఎల్‌లో రెండు సార్లు టైటిల్స్ నెగ్గిన జమైకా తల్లవాస్ గత రెండు సీజన్లు అభిమానులను నిరాశపరిచింది. కీలక మ్యాచుల్లో ఓడిపోవడం ద్వారా వరుసగా రెండు సీజన్లు నాలుగో స్థానం(4th place)తోనే సరిపెట్టుకుంది. 2015లో ఇలాగే నాలుగో స్థానంలో నిలిచినా తర్వాత ఏడాది టైటిల్ నెగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈసారి కూడా రస్సెల్(Russel) నాయకత్వంలోని జట్టు తప్పకుండా టైటిల్ నెగ్గుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కర్ట్నీ వాల్ష్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టుకు మార్క్ ఓడొన్నెల్ కోచ్‌గా, రామ్ నరేష్ శర్వాన్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నారు.

క్రిస్ గేల్ లేకపోవడం లోటే..

టీ20 స్పెషలిస్ట్ క్రిస్ గేల్(Cris gale) ఈ సీజన్‌లో జట్టును వీడాడు. జట్టు అసిస్టెంట్ కోచ్‌ శర్వాన్‌తో విభేదాల వల్లే అతను సెయింట్ లూసియా జౌక్స్‌కు మారినట్లు వార్తలు వచ్చాయి. గేల్ కూడా శర్వాన్‌పై (Sharwan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘అతడు కరోనా వైరస్ కంటే దారుణమైన వ్యక్తి’ (carona virus) అని శర్వాన్‌ను ఉద్దేశించి గేల్ వ్యాఖ్యానించాడు. తన వల్లే జమైకా జట్టు తనను రిటైన్ చేసుకోలేదని ఆరోపించాడు. క్రిస్ గేల్ వంటి బ్యాట్స్‌మాన్ జట్టులో లేకపోవడం పెద్ద లోటే అని చెప్పుకోవాలి. గతంలో ఎన్నోసార్లు గేల్ ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. కానీ ఈ సారి భారమంతా కెప్టెన్ ఆండ్రూ రస్సెల్‌పైనే పడనుంది.

పూర్తి జట్టు :

ఆండ్రు రస్సెల్ (కెప్టెన్)(Captain), ఆండ్రీ మెక్‌కాథీ, జర్మానే బ్లాక్‌వుడ్, అసిఫ్ అలీ, నికోలస్ కిర్టన్, రావ్‌మన్ పావెల్, కార్లోస్ బ్రాత్‌వెయిట్, రుమా బోనర్, చాడ్విక్ వాల్టన్, గ్లెన్ ఫిలిప్స్, ఓషానే థామస్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, వీరస్వామి పెరుమాళ్, తబ్రెజ్ శంషీ, సందీప్ లమిషానే, ముజీబుర్ రెహమాన్, ప్రిస్టన్ మెక్‌స్వీన్, జేవర్ రాయల్, రమాల్ లూయిస్, ర్యాన్ పిసోద్.


Next Story

Most Viewed