'సీతారాంఏచూరి'పై అక్రమ కేసులకు కుట్ర

by  |
సీతారాంఏచూరిపై అక్రమ కేసులకు కుట్ర
X

దిశ, మునుగోడు: ఢిల్లీ అల్లర్ల కేసులో సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రముఖ ఆర్థికవేత్త జయతీఘోష్, ఇతర మేధావులను అక్రమ కేసుల్లో ఇరికించే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నుతోందని సీపీఐ(ఎం) యాదాద్రి జిల్లా కార్యదర్శి జహంగీర్ ఆరోపించారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఢిల్లీ అల్లర్ల కేసులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో సీతారాం ఏచూరి, ఇతర మేధావుల పేర్లను చేర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితమైన తప్పుడు విధానాలను వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ అల్లర్లు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలే దారితీశాయని ఆరోపిస్తూ, వారిపై అక్రమ కేసులు బనాయించడం సరైంది కాదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకులపై అక్రమ కేసులు పెడుతూ… ఉద్యమాల్ని అణచివేయాలని కుట్ర చేయడం సిగ్గుచేటన్నారు.



Next Story