- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెప్టెంబర్ 2న సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వాలి !
దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ద్వారా మల్లన్నసాగర్‌కు నీళ్లిచ్చి ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్న సీఎం కేసీఆర్ ఇప్పటికీ ఆ పనిచేయలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. సెప్టెంబర్ 2న సీఎం అపాయింట్‌మెంట్ ఇస్తే సమస్యలను వివరిస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. లేకుంటే ప్రగతిభవన్ గేటు ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలన్న టీఆర్ఎస్ ఆలోచన ఎప్పటికీ జరగదన్నారు. తామెప్పుడూ ప్రజాస్వామ్యవాదులమేనని చెప్పుకొచ్చారు.
ఎన్నికల హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని శనివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిందని గుర్తుచేశారు. రైతులకు ఉచిత విద్యుత్, లక్ష రూపాయల రుణమాఫీ పథకాలను ప్రకటించి అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. 2018లో టీఆర్ఎస్ మాటల గారడితో గెలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రజల పక్షాల పనిచేస్తుందని, దీన్ని ప్రజలు గమనించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.