- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదు డిమాండ్లతో సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ
దిశ, మెదక్: లాక్‌డౌన్ పరిస్థితుల దృష్ట్యా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌కు ఐదు డిమాండ్లతో కూడిన లేఖ రాశారు. తన డిమాండ్లతో ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారని, కాబట్టి ప్రస్తుతం హౌస్‌టాక్స్ కట్టే పరిస్థితి లేదని, ఈ ఏడాది టాక్స్ మాఫీ చేయాలని జగ్గారెడ్డి కోరారు. అలాగే, అద్దె ఇండ్లలో ఉంటున్న వారు కూడా రెంట్ కట్టే పరిస్థితిలో లేరని వారికి కూడా 6 నెలలపాటు ప్రభుత్వమే అద్దె చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక నల్లా బిల్లులు కూడా ఏడాదిపాటు రద్దు చేయాలని లేఖలో జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలకు కూడా రాయితీ ఇవ్వాలన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, తన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. అలాగే, ఈ నెల 8 లోపు ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ఈ నెల 9న తాను దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఎంపీలతో కేంద్రం మీద ఒత్తిడి పెంచాలన్నారు.