కేసీఆర్ కి జగ్గారెడ్డి వార్నింగ్ 

by Anukaran |   ( Updated:2020-08-31 11:58:02.0  )
కేసీఆర్ కి జగ్గారెడ్డి వార్నింగ్ 
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ కోరారు. సెప్టెంబర్ 2న కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేసీఆర్ కు లేఖ రాశారు. అపాయింట్‌మెంట్ ఇస్తే ప్రజాసమస్యల పరిష్కారం కోరతానని పేర్కొన్నారు జగ్గారెడ్డి. లేకపోతే, తన కూతురితో కలిసి అదే రోజు ప్రగతి భవన్‌ ముందు కూర్చుంటానని హెచ్చరించారు.

ఎన్నికల్లో తన కూతురు పోటీపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు తన ఆందోళనంతా ప్రజా సమస్యలపైనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న నాయకులెవరన్నది తేల్చే పనిలో ఉన్నామని తెలిపారు జగ్గారెడ్డి.

Advertisement

Next Story