అసెంబ్లీలో ప్రశ్నిస్తా : జగ్గారెడ్డి

దిశ, వెబ్‌డెస్క్ :

ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మాజీ సీఎం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పంజాగుట్టలోని ఆయన విగ్రహానికి జగ్గారెడ్డి బుధవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల అధ్వాన పరిస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు .

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు కూడా లేవని విమర్శించారు. ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో లేక కొవిడ్ రోగులు ఇబ్బందులు పడుతున్నారని జగ్గారెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. పీసీసీ చీఫ్, ఎమ్మెల్యేలతో చర్చించాకే సీఎల్పీ నాయకుడి హోదాలో భట్టి జిల్లాల పర్యటనలు చేస్తున్నారని.. ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులను పరిశీలించటానికే భట్టి విక్రమార్క పర్యటన సాగుతోందన్నారు. అయితే, భట్టి పర్యటనలను భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

Advertisement