నా గళం వినిపిస్తా….

by Shyam |   ( Updated:2020-09-06 10:29:01.0  )
నా గళం వినిపిస్తా….
X

దిశ వెబ్ డెస్క్: అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తానని సంగా రెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. 15 రోజుల్లోగా మెడికల్ కాలేజీ హామీని నెరవేర్చుక పోతే తాను దీక్ష చేపడతానని అన్నారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజా సమస్యలు సులువుగా పరిష్కారమయ్యేవన్నారు. కానీ టీఆర్ఎస్ సర్కార్ లో ఎమ్మెల్యేలతో కూడా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సంగారెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి సీఎంను కలవాలనుకున్నానని తెలిపారు. కానీ ఆయన నుంచి అనుమతి లేకపోవడంంతో కలవలేకపోయాలని అన్నారు. అందుకే అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై గళమెత్తుతానని అన్నారు.

Advertisement

Next Story