- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బసిరెడ్డిని మించిన విలనిజం.. సూపర్‌స్టార్‌తో జగ్గూభాయ్
దిశ, సినిమా : టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించిన జగపతిబాబు ఇప్పుడు ఆ ఇమేజ్ నుంచి బయటపడ్డారు. స్టైలిష్ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, పవర్‌ఫుల్ రౌడీ, ఫాదర్.. ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల పాత్రలు చేస్తూ ఆల్‌రౌండర్ అనిపించుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న రోల్స్ దక్కించుకుంటూ టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు మాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే మాస్ డైరెక్టర్ శివ, సూపర్ స్టార్ రజనీతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘అన్నాత్తే’ మూవీలో విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు జగ్గూభాయ్.
ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు జగ్గు. కీర్తి సురేష్, నయనతార, ఖుష్బూ, మీనా కీలక పాత్రల్లో కనిపించబోతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా.. రజనీకాంత్ సినిమా కోసం సిద్ధమవుతున్నానంటూ ఓ వీడియో పోస్టు చేసిన జగపతి బాబు, ‘మేకోవర్‌కి రెడీ’ అనే క్యాప్షన్ జత చేశాడు. ఈ సినిమాలో పోషించే పాత్ర ద్వారా ‘అరవింద సమేత’లోని బసిరెడ్డి పాత్రను మరిపిస్తానని, ఈవిల్ లుక్ రెడీ అవుతోందని ప్రామిస్ చేశాడు. కాగా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి జగపతిబాబు ఇంతక ముందు ‘కథానాయకుడు, లింగ’ సినిమాలు చేశాడు.
https://www.instagram.com/p/CODhRx1HP2I/
tags: