మూడు రాజధానుల బిల్లు వెనక్కి…? సీఎం జగన్ సంచలన నిర్ణయం?

by srinivas |   ( Updated:2021-11-22 00:31:27.0  )
cm ys jagan
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాసేపట్లో ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ జరగనుంది. ఈ భేటీలో మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఉన్న మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

కొన్ని మార్పులతో కొత్తగా సభలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఏపీలోని వరద పరిస్థితులపై కేబినెట్ చర్చించనుంది. అలాగే వర్షాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను నేటితో ముగించేలా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. కాగా అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో మహాపాదయాత్ర సాగిస్తుండటం, రైతుల పాదయాత్రలో బీజేపీ నేతలు స్వయంగా పాల్గొని మద్దతు తెలిపిన నేపథ్యంలో జగన్ తీసుకోనున్న నిర్ణయంపై జోరుగా చర్చ జరుగుతోంది.

చంద్రబాబుకు మద్దతుగా మరో ఉద్యోగి రాజీనామా

Advertisement

Next Story